Oct 04,2023 19:37

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు వి కృష్ణయ్య

ప్రజాశక్తి-కందుకూరు :ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సిపిఎం పాదయాత్రలు చేపట్టిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కష్ణయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలని కోరుతూ సిపిఎం చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి కందుకూరు చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్‌ బొమ్మ వద్ద జరిగిన బహిరంగ సభలో వి కష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 98 శాతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు చెబుతున్నాయి. వారు చెపుతున్న మాటల్లో వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాలు అంత పెద్ద ఎత్తున హామీలు అమలు చేసి ఉంటే రైతులు ఎందుకు చనిపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. ఉన్న 5 కోట్ల మంది ఉద్యోగాలు మోడి ఊడ గోటారన్నరు. బిజెపిని వ్యతిరేకించే దాదాపు 5 వేల మందికి ఐటీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వేసిన పునాది రాళ్లు సమాధి రాళ్లుగా మిగిలిపోయాయని కష్ణయ్య విమర్శించారు. బహిరంగ సభలో నెల్లూరు జిల్లా సిపిఎం కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎస్‌.కె మున్వర్‌ సుల్తానా, జి వెంకటేశ్వర్లు ,జివిబి కుమార్‌ ,ముప్పరాజు కోటయ్య పాల్గొన్నారు.