ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :పాలక ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి అవకాశ వాద రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. మోహన్ రావు విమర్శించారు. నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోరుతూ జరుగుతున్న పాదయాత్రలో భాగంగా 6 రోజు ముత్తుకూరు మండలం, పైనాపురం నుంచి బుధవారం సాయంత్రం తోటపల్లి గూడూరు మండలం వరకవి పూడిలో ప్రవేశించింది. పాదయాత్ర బందానికి సిపిఎం మండల కమిటీ సభ్యులు మారూబోయిన రాజా ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మోహన్ రావ్ మాట్లా డుతూ ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా దళిత, గిరిజన కాలనీల అభివద్ధిని, ప్రజా సమస్యలని విస్మరిస్తున్నాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యపు కోరల్లో ప్రజలు విలవిలలేడుతున్నారన్నారు. కాలుష్యపు కోరల నుంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ప్రాణాలతో ఆడుకొంటున్నారని ధ్వజమెత్తారు. పరిశ్ర మల నుంచి విడుదల అవు తున్న కాలుష్యాన్ని నియం త్రించాలని అయన డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న సెంబ్కార్బ్ (గాయత్రి ), ఎన్సిసి కంపెనీలో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిం చాలని మోహన్ రావు కోరారు. ఎన్‌సిసి కింద భూములు కోల్పోయిన వారికి నెలకు 25 కేజీల బియ్యం,రూ. 3వేలు ప్యాకేజీ ఇవ్వాల ని అయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలి రేట్లు రూ. 600 ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. పారుదల,కాలువల మరమ్మతులు చేయిం చాలన్నారు. చెరువులు అన్యాక్రాంతం క కుండా చర్యలు తీసుకోవాల న్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాద యాత్రలలను జయప్రదం చేయా లని రాజా కోరారు. పాదయా త్ర ఈ నెల 12వ తేదీ ఉదయం మల్లికార్జునపురం నుంచి ప్రా రంభంమై తోటపల్లి గూడూరు, పాపిరెడ్డిపాలెం, పేడూరు గ్రా మాల మీదుగా నరకూరు సెం టర్ కి చేరుకొంటుందని రాజా చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోగులు శ్రీని వాసులు, ఆలూరి తిరుపాలు, టివివి ప్రసాద్, కె. పెంచల నర సయ్య, గడ్డం అంకయ్య, ఎస్ ఎఫ్‌ఐ నాయకులు శ్రీను, నరేం ద్ర, అశ్విన్, ఆటో యూనియన్ అధ్యక్షులు పరశురామయ్య, మండల నాయకులు కాంతి రెడ్డి, రవణమ్మ, పచ్చ మధు ఉన్నారు.










