Sep 20,2023 22:39

ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించండి : జెసి
ప్రజాశక్తి-పెద్దపంజాణి:
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజాసమస్యలను బాధ్యతగా సంబంధిత అధికారులు పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగు పరిచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందనన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు వారి సమస్యలను పరిష్కరించే దిశలో భాగంగా వెంటనే పరిష్కరించే అర్జీలను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, ఆర్థికపరమైన అంశాలతో కూడి ఉన్న అర్జీలను సంబంధిత శాఖలకు పరిష్కార నిమిత్తం పంపి, పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించకపోవడానికి గల కారణాలను అర్జీదారునికి తెలియజేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారంలో బుధ,శుక్రవారాలలో మండలస్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అర్జీదారుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. నిష్పక్షపాతంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, డిఆర్‌డిఏ, డ్వామా పీడీలు తులసి, గంగా భవాని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మురళీ కష్ణ, మధుసూదన్‌ రెడ్డి,ప్రభాకర్‌, ఆర్‌ అండ్‌బి ఎస్‌ఈ ఉమామహేశ్వర రెడ్డి, పిఆర్‌ ఈఈ చంద్ర శేఖర్‌రెడ్డి, డిపిఓ లక్ష్మీ, డిఎల్‌డిఓ రవికుమార్‌, పలమనేరు ఆర్‌డిఓ శివయ్య, తహశీల్దార్‌ లోకేశ్వర్రావు, ఎంపీపీ రెడ్డప్ప, సింగిల్‌ విండో చైర్మన్‌ ఓబుల్‌ రెడ్డి, ఎంపిడిఓ అబ్దుల్‌ రహీం, స్థానిక సర్పంచ్‌ అఖిలా జాఫర్‌, కోఆప్షన్‌ నెంబర్‌ రహమతుల్లా, నాయకులు గురునాథరెడ్డి, రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తాసిల్దార్‌ ఫణి కుమార్‌, గ్రామరెవెన్యూ అధికారి సుబ్రహ్మణ్యం, ఉమాశంకర్‌ పాల్గొన్నారు.