Nov 29,2022 22:00

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు
ప్రజాశక్తి-యాదమరి:
ప్రజా సమస్యలకు సచివాలయ ఉద్యోగులు తక్షణ పరిష్కారం చూపాలని.. కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని.. ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు సూచించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోనాపల్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం మండలస్థాయి అధికారులు.. సచివాలయ సిబ్బంది .. వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సచివాలయ పరిధిలో పర్యటించడం లేదని.. వాలంటీర్లు తీసుకొచ్చిన సమస్యలకు పరిష్కారం చూపడం తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదన్నారు. కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ, సిమెంట్‌ రోడ్లు వేయించాలని ప్రజలు ఎమ్మెల్యే దష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వెంటనే ఇంజినీరింగ్‌ అధికారులను అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పక్కాఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు . నవరత్నాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు ధనంజయ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్‌ , ఉపాధ్యక్షులు హరినారాయణ రెడ్డి రవీంద్ర, మనోహర్‌ రెడ్డి, జెడ్పీటీసీ కోనాపల్లి మనోహర్‌ , సర్పంచులు రమేష్‌, జేకే రవి, తహసీల్దారు చిట్టిబాబు, మండల అభివద్ధి అధికారి శివరాజ్‌, ఎస్సై సుమన్‌, ఎంఈవో రుక్మిణి, ఏపీఎం కల్పలతారెడ్డి, ఏపీవో కవిత, హౌసింగ్‌ ఏఈ శ్రీనివాసులు, విద్యుత్‌ శాఖ ఏఈ గుర్రప్ప, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నవీన్‌, పంచాయతీరాజ్‌ ఏఈ జయచంద్రారెడ్డి, ఏఈలు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.