ప్రజాశక్తి - ఉండి
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు అన్నారు. మండలంలోని యండగండి 1, 2 సచివాలయాల పరిధిలో గ్రామ సర్పంచి గోగులమండ చిన్నకృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పివిఎల్.నరసింహరాజు హాజరయ్యారు. అర్హులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, మండల పరిషత్ సహ ఉపాధ్యక్షురాలు దత్తాల సుజాత రాణి, కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, నాయకులు పాల్గొన్నారు.
పెనుమంట్ర : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మండలంలోని జుత్తిగ, నత్తా రామేశ్వరం గ్రామాల్లో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జుత్తిగ సర్పంచి తమనంపూడి వీర్రెడ్డి, నత్తా రామేశ్వరం సర్పంచి వెలగల ధర్మారెడ్డి, గరువు సర్పంచి ము దునూరి నాగరాజు, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి), ఎంపిటిసి సభ్యులు మాండ్ర శాంతకుమారి, తహశీల్దార్ దండు అశోక్ వర్మ, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి పాల్గొన్నారు.
గణపవరం : క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని అర్ధవరం, చిలకపాడు గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సభలకు ఆయా గ్రామ సర్పంచులు చుక్క అప్పారావు, గాతల సుజాత అధ్యక్షత వహించారు. స్థానికులకు ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దండు వెంకట రామరాజు, ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి, తహశీల్దార్ లక్ష్మి, ఇఒపిఆర్‌డి సత్యనారాయణ పాల్గొన్నారు.
పోడూరు : మండలంలోని పి.పోల వరం, కవిటం గ్రామ సచివాలయాల పరిధిలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ శ్రీరంగనాథ రాజు, రుడా ఛైర్మన్ షర్మిల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కొత్తగా మంజూ రౖన ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్ర మంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరు పెద్దిరాజు, ఎంపి పి సుమంగళి సాగర్, తహశీల్దార్ ఆర్‌వి.కృ ష్ణారావు, ఎంపిడిఒ డి.సుహాసిని, పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : భీమవరంలోని ఏడో వార్డు, 19వ వార్డు సచివాలయాల వద్ద జరిగిన జగనన్న సురక్ష సభల్లో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గడపగడపకు ప్రభుత్వ పాలనను చేరువ చేసేందుకే సిఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
వీరవాసరం : మండలంలోని వీరవాసరం, రాయకుదురు గ్రామాల్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులందరికీ లబ్ధి చేకూరాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అనంతరం అవసరమైనవారికి ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చికిలే మంగతాయారు, గెడ్డం భారతీభాస్కరరావు, ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ గొలగాని సత్యనారాయణ, తహాశీల్దార్ సుందరరాజు, ఎంపిడిఒ జ్యోతి, ఎంపిటిసి సభ్యులు బోను జోత్స్నదేవి, వీరవల్లి ఉషారాణి, కడలి ధర్మారావు, నూకల కనకారావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
మొగల్తూరు : మండలంలోని కొత్తోట, కొత్తపాలెం సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరై మాట్లాడారు. కాళీపట్నం జమీందారి భూమల సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు.
ఆచంట : మండలంలోని వల్లూరు గ్రామంలో ఎఎంసి ఛైర్మన్ లావణ్య అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రుడా ఛైర్మన్, ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి, ఎంపిటిసి సభ్యులు ఏడిద రామలక్ష్మి, ఎంపిడిఒ జగన్నాధరావు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
కాళ్ల : ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్క రించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుం దని మండల ప్రత్యేకాఅధికారి కె.కిషోర్‌కు మార్ అన్నారు. బొండాడ, ఏలూరుపాడు-1 సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
పెనుగొండ : మండలంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పరిశీలకుకురాలు, రాజమండ్రి ఉడా ఛైర్మన్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు.










