Nov 02,2023 18:18

గోడపత్రికను అవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-కందుకూకు :  కందుకూరు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా రక్షణ బేరి గోడపత్రికను సిపిఎం నాయకులు ఎస్‌ఎ గౌస్‌, డి రామ్మూర్తి , ఎస్‌.కె మున్వర్‌ సుల్తానా, ఎస్‌.కె మల్లిక, ఎం పద్మ ,డి ఎం రాయుడు ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ఏ గౌస్‌ మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ బస్సు యాత్ర కందుకూరు పట్టణానికి నవంబర్‌ 6 తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు కందుకూరు అంబేద్కర్‌ బొమ్మ వద్దకు వస్తుందన్నారు. అంబేద్కర్‌ బొమ్మ వద్దబహిరంగ సభ ఉంటుందన్నారు. జయప్రదం చేయాలని కోరారు.