Mar 26,2022 15:29

ప్రజాశక్తి  - క్యాంపస్ : మన చుట్టూ ఉన్న పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండని మహిళా వర్సిటీ ఎన్ ఎస్ ఎస్  ప్రోగ్రామ్  అధికారులు పేర్కొన్నారు. శనివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్  యూనిట్లు  3, 7,11 ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలో  వివిధ  గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు పై అవగాహన ఏర్పరచుకుని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కథలతో ఆటపాటలతో అవగాహన కల్పించారు.  ప్రోగ్రాం అధికారిణులు  చిన్నారులతో మాట్లాడుతూ  కోవిడ్ మహమ్మారి భారీన పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి  చెప్పారు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ప్రతిరోజు వారు వాడే స్కూలు బ్యాగులు, లంచ్ బాక్స్ లు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నోటి పరిశుభ్రత, వ్యాయామం వంటి వాటి ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిణులు డాక్టర్ నీరజ, డాక్టర్  పి.మాధవి, డాక్టర్ పద్మావతి, గ్రామ సర్పంచ్ శుభ, స్కూల్ టీచర్లు  రాజేశ్వరి, మునిచంద్ర పాల్గొన్నారు.