ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుకుందామని ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్ ఎం.గౌతమి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం జెఎన్‌టియు స్వచ్ఛత హి సేవలో భాగంగా శ్రమదానం చేశారు. ఇందులో భాగంగా నాయకులు, అధికారులు చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. కలుపు మొక్కలను ఏరువేసి చెత్తను తొలగించారు. అనంతరం జెఎన్‌టియు మైదానం వరకూ ర్యాలీగా వెళ్లి మానవహారం ఏర్పాట చేశారు. తర్వాత స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితం అవ్వాలని కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. తర్వాత కాఫీ విత్ కార్మికుల్లో భాగంగా క్లాప్ మిత్రులు, పారిశుధ్య కార్మికులతో కలిసి ఎంంపి, కలెక్టర్, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్, జెసి, తదితరులు కాఫీ తాగారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్‌డిఓ మధుసూదన్, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రమణారెడ్డి, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, డిఎల్‌పిఒ సుమన జయంతి, తహశీల్దార్లు శ్రీధర్‌మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
చీపురుతో కసువు ఊడుస్తున్న కలెక్టర్ ఎం.గౌతమి










