Sep 19,2023 21:20

పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో డిస్ట్రిక్ట్‌ ఇండిస్టియల్‌ అండ్‌ ఎక్స్పర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం (డిఐఈపిసి) కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తద్వారా ఉపాధి అవకాశాలు పెంపుపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ డెవలప్మెంట్‌ పాలసీ 2023-27ని తీసుకొని రావడం జరిగిందని, ఈ పాలసీపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, పరిశ్రమల యజమానులతో ఈనెలాఖరులోపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిఎం డిఐసి చంద్రశేఖర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే ఎస్సీ,ఎస్టీ ఎంటర్ప్యూర్స్‌ కొరకు వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం పథకంపై అవగాహన పెంచాలన్నారు. పిఎం విశ్వకర్మ స్కీం కింద రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సింగల్‌ డెస్క్‌ పోర్టల్‌ కింద 7.7.23 నుండి 16.923 వరకు 125 అప్లికేషన్‌లు అందగా. 111 అప్లికేషన్‌లు అప్రూవల్‌ చేయడం జరిగిందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలలో గండ్రాజుపల్లిలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్‌ తెలిపారు. డిస్టిక్‌ లెవెల్‌ ప్రీస్కూటీని కమిటీ 91 క్లైమమ్స్‌కు రూ.4.41 కోట్లతో సబ్సిడీ మంజూరుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ (పీఎంఈజీపి) 2023- 24 సంవత్సరంలో డిస్ట్రిక్ట్‌ ఇండిస్టీస్‌ సెంటర్స్‌ టార్గెట్‌ యూనిట్లు 104 కాగా 64 యూనిట్లు మంజూరు, ఏపీ ఖాదీ, లేజ్‌ ఇండిస్టీస్‌ బోర్డ్‌ లక్ష్యం 82 కాగా 43 మంజూరు, ఖాదీ విలేజ్‌ ఇండిస్టీస్‌ కమిషన్‌ లక్ష్యం 58 కాగా, మూడు యూనిట్లు మంజూరు కావడం జరిగిందని జిఎండిఐసి వివరించారు. ఈసమావేశంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యలపై పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపు తదితరాంశాలపై చర్చించారు. ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి ఇన్సెంటివ్‌ మంజూరు చేయాలని జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య కార్యదర్శి కలెక్టర్‌కు విన్నవించారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు మురళీ కష్ణ, మధుసూదన్‌ రెడ్డి, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నరేంద్రన్‌, డిపిఓ లక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజ్యలక్ష్మి, జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య కార్యదర్శి గోవర్ధన్‌ బాబీ, సిక్కి నేషనల్‌ చైర్మన్‌ డేవిడ్‌, ఉమెన్‌ ఛైర్మన్‌ వినమ్రత, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.