ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ మాజీ సైనిక ఉద్యోగులు పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు కె.రాజశేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం సైనిక సంక్షేమ శాఖ, జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగులకు పరిశ్రమల ఆవశ్యకత, పరిశ్రమల స్థాపన, సాంకేతికత అనుమతులు మంజూరు, పారిశ్రామిక రాయితీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనిక ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఉపాధి పొంది పదిమందికి ఉపాధి కల్పిచేందుకు పరిశ్రమల ఏర్పాటు మంచి మార్గమన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో పరిశ్రమలు అభివృద్ది చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైనిక ఉద్యోగుల సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసులు, మత్స్యశాఖ ఉప సంచాలకులు శాంతి, అటల్ ఇంకుబేషన్ సెంటర్ డాక్టర్ చంద్రమౌళి, ఎల్‌డిఎం సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులుకె.రాజశేఖర్‌రెడ్డి










