రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ మారుతిరావు
ప్రజాశక్తి- గుడ్లూరు :మండలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల నివారణకి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ మారుతీ రావు సూచించారు. మండలంలోని పూరేటిపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు. గ్రామములో ఎక్కువమందికి జ్వరాలు, దగ్గు, జలుబు సోకిన వారందరికీ అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం కొంతమంది రోగులను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్య సిబ్బంది ,ఆశా వర్కర్లు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.










