May 23,2023 21:54

చెత్తసేకరణను పరిశీలిస్తున్న జెడ్పీ సిఇఒ కె.భాస్కర్‌రెడ్డి

           ప్రజాశక్తి-అనంతపురం సిటీ    ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలకు దూరంగా ఉండాలని జిల్లా పరిషత్‌ సిఇఒ కె.భాస్కర్‌రెడ్డి సూచించారు. మంగళవారం అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి రూరల్‌ గ్రామ పంచాయతీలో జెడ్పీ సిఇఒతోపాటు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు పర్యటించారు. ఇందులో భాగంగా కక్కలపల్లి మెయిన్‌ విలేజ్‌, ఇందిరమ్మ, కళావతమ్మ కాలనీల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్వహణ, ట్యాంకుల పరిశుభ్రత, డ్రెయినేజీల నిర్వహణ గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే పంచాయతీ కార్మికులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ, సచివాలయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ, విస్తరణ అధికారి అలివేలమ్మ, సర్పంచి గార్లదిన్నె క్రిష్ణయ్య, జడ్పిటిసి జూటూరు చంద్రకుమార్‌, ఎంపీటీసీ జూటూరు పెన్నోబులేసు, ఉప సర్పంచి బండి రమేష్‌, కక్కలపల్లి సీనియర్‌ నాయకులు కల్లుమడి శ్రీనివాసులు, గాండ్ల ఆదినారాయణ, గాండ్ల బయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.