Nov 07,2022 21:40

గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌

పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవర్ధన్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రాధాన్యతగా గుర్తించాలని మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో యూనిసెఫ్‌ గ్రేడ్స్‌ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మెప్మా గోపి, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, మహేశ్వర్‌, యూనిసెఫ్‌ మేనేజర్‌ సుకన్య పాల్గొన్నారు.