May 05,2023 21:13

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పరిసరాలను పరిశుభ్రతగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పట్టణ మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి వైవి.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 15, 16 వార్డుల పరిధిలోని క్లస్టర్‌ 14, 16, 13 అలాగే 1, 3, 6, 7, 8 వార్డుల్లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే, ఫీవర్‌సర్వే చేశారు. అనంతరం దోమల ద్వారా చచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగీ రాకుండా నివారణ ఒక్కటే ముఖ్యమన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలందరూ శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు చంద్ర, అంబిక, ఆశా కార్యకర్తలు, శానిటేషన్‌ కార్యదర్శి దుర్గ ప్రసాద్‌, వాలంటీర్లు పాల్గొన్నారు.
గణపవరం : ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించి దోమల నివారణకు కృషి చేయాలని పిహెచ్‌సి డాక్టర్లు పి.సంతోష్‌నాయుడు, పి.కిరణ్మయి అన్నారు. శుక్రవారం మండలంలోని అన్ని సచివాలయాల వద్దా, పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు సంతోష్‌ నాయుడు, కిరణ్మయి మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో తడి లేకుండా పొడి వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. దోమల వల్ల డెంగీ, మలేరియా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌ బాబు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కాశిపాడులో జరిగిన ఫ్రైడే డ్రైడేలో పాల్గొన్న ఆరోగ్య సహాయకులు నామాల రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎం శివకుమారి ఆశా వర్కర్లు కృష్ణకుమారి, వరలక్ష్మి పాల్గొన్నారు.