Mar 15,2022 16:30

ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాజారెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య వి. శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య ఓ. మహమ్మద్ హుస్సేన్ లతో కలిసి వర్సిటీలోని సైన్స్, ఆర్ట్స్ కళాశాల పరిధిలో నేచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ప్రకాశం భవనంలోని పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  పరీక్షల నిర్వహణ విధానం బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కళాశాల యాజమాన్యం   తగిన చర్యలు చేపట్టడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్ కు అవకాశం లేకుండా పర్యవేక్షకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. శ్రీనివాసులు రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి వి  మురళీధర్, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.టి. రామక్రిష్ణా రెడ్డి, అధ్యాపకులు ఆచార్య వై.సి. రత్నాకరం, ఆచార్య ఎస్. కిషోర్, మణి, సిబ్బంది పాల్గొన్నారు.