May 22,2023 22:20

13వ రోజుకు పాలకోడేరు రైతుల నిరసన
ప్రజాశక్తి - పాలకోడేరు 

               పరిహారం అందిస్తామని చెప్పి భూములు తీసుకుని అధికారులు మోసం చేశారని పాలకోడేరు జగనన్న లే అవుట్‌కు భూములు ఇచ్చిన రైతులు విమర్శించారు. పరిహారం ఇవ్వకపోతే మా భూమి మాకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాలకోడేరు జగనన్న లే అవుట్‌కు భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా బాధితులంతా మండుటెండలో నిరసన తెలిపారు. దీక్షలు కొనసాగిస్తున్న అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించే వరకు తమ దీక్షలు విరమించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు రామలక్ష్మి, నరేష్‌, సంబలదీవి సాయిబాబా, సత్యనారాయణ పాల్గొన్నారు.