ప్రజాశక్తి - క్యాంపస్ : ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నికల పాదయాత్ర హామీలో 2 లక్షల 32 ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 3 సంవత్సరాల కాలం అయిన సరైన నోటిికేషన్లు అవ్వడం లేదని అన్నారు. ప్రతి సంవత్సరం మెగా DSC, పోలీస్ ఉద్యోగ నోటిికేషన్లు ఇవ్వడం లేదని ఆగ్రహించారు. అలాగే ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాకి తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో గిరిజన నవ సమాజ్ రాష్ట్ర కమటీ తరపున శివ శంకర్ నాయక్ పాల్గొన్నారు.










