
బూర్జ: అరాచక ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయక తప్పదని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. తోటవాడలో బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపులు, అరెస్టులతో ఐక్య రాజకీయాలు మారాయని, ఓటుహక్కు ఉన్న ప్రతి పౌరుడు ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ జెడ్‌పిటిసి ఎ. రామకష్ణ, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సీతారాంబాబు నాయుడు, మాజీ వైస్ ఎంపిపి పీరుకట్ల ప్రభాకరరావు, మాజీ సర్పంచ్ గేదెలు ప్రసాదరావు, మజ్జి శ్రీరాములు నాయుడు, లంక జగన్నాథంనాయుడు, గణపతిరావు, వెంకట సీతారామరాజు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.