May 27,2023 22:23

ప్రజాశక్తి - పాలకోడేరు
             జగనన్న ప్రభుత్వానికి వాలంటీర్లు పట్టుకొమ్మలని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. శృంగవృక్షం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం సచివాలయ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా అర్హత ప్రాతిపదికగా పథకాలు అమలు చేయడం విప్లవాత్మకమైన చర్య అన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి కృష్ణంరాజు, పెన్మత్స శ్రీనివాసరాజు, గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు, కటిక శ్రీదేవి, కొత్తపల్లి కాశీ విశ్వనాధరాజు, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు పెన్మత్స వెంకటరాజు, సర్పంచులు బొల్లా శ్రీనివాస్‌, జంగం సూరిబాబు, చిల్లా అనూష, వైస్‌ ఎంపిపిలు సోడదాసి నరేష్‌, ఆదాడ లక్ష్మీతులసి, ఎంపిటిసిలు షేక్‌ పాపా సాహెబ్‌, బళ్ల భారతి, ఆరేపల్లి పెద్ద వెంకటస్వామి, మల్లుల సూర్యకళ పాల్గొన్నారు.
     పోడూరు : వాలంటీర్‌ వ్యవస్థతో రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన అందుతుందని వైసిపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. పోడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్‌ఎ శ్రీరంగనాధరాజు, జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళి సాగర్‌ మండలంలో ఆచంట నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాలకు చెందిన వాలంటీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ఇందుకూరి సీతారామరాజు, ఎంపిడిఒ ఎం.బలరామరాజు, హౌసింగ్‌ ఎపి సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనర్ల డైరెక్టర్లు పెద్దపాటి పెద్దిరాజు, పోతుమూడి రామచంద్రరావు, సర్పంచి శెట్టిబత్తుల సువర్ణరాజు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
   ఉండి : వాలంటీర్లు సంక్షేమ సారధులని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు కొనియాడారు. మండలంలోని కోలమూరు గ్రామ సచివాలయ ఆవరణలో ఎంపిడిఒ అడబాల వెంకట అప్పారావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహారాజు పాల్గొన్నారు. మండలంలోని పాములపర్రు, కోలమూరు, ఉప్పులూరు, కలిగొట్ల, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, వాండ్రం గ్రామ సచివాలయాలలోని వాలంటీర్లకు సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ డైరెక్టర్‌ గులిపల్లి అచ్చారావు, నాయకులు నడింపల్లి రాంబాబు రాజు, గండ్రాజు రాజేష్‌వర్మ, సూరవరపు వెంకటాచార్యులు, పేరిచర్ల మహేష్‌, మున్నలూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
   యలమంచిలి :గ్రామ వాలంటీర్లు అందరూ రానున్న రోజుల్లో జగనన్న సైనికులుగా పని చేయాలని ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి వెంకటరమణ బుజ్జి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సభలో గ్రామ వాలంటీర్లకు సేవా వజ్రా, సేవారత్న, సేవా మిత్రా పురస్కారాలు ఎంఎల్‌ఎ కవురు శ్రీనివాస్‌ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు కూడా లేని గౌరవం గ్రామస్థాయిలో వాలంటీర్లకు కలిగిందని, దీనంతటికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వాలంటీర్లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
నేడు పాలకొల్లులో...
    పాలకొల్లు రూరల్‌ :
పాలకొల్లు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని గ్రామాల వాలంటీర్లు పాల్గొనాలని కోరారు. వాలంటీర్లకు సేవారత్న, సేవా మిత్ర, సేవా వజ్ర పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు.