మాట్లాడుతున్న కలెక్టర్
ప్రభుత్వ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు మెరుగు
ప్రజాశక్తి-నెల్లూరు:జిల్లాలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు మెరుగుపడేలా కషి చేయాలని కలెక్టర్ యం. హరి నారాయణన్, వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ హరి నారాయణన్, కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వైద్యాధికారులతో సమావేశమై, జిల్లాలోని అన్నీ ప్రభుత్వ అస్సుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పధకం క్రింద జరుగుచున్న వైద్య సేవలు 'న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ) ఏర్పాటు పై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు మెరుగుపడేలా కషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి పేషెంట్ కు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు ఆరోగ్య శ్రీ పధకం పరిధిలోకి వచ్చే పేషెంట్ వివరాలను రిజిస్ట్రేషన్ నుండి డిశ్చార్ వరకు పేషెంట్ వారిగా స్టేజీ వారిగా వారి వివరాలను ఆన్ లైన్ లో కచ్చితంగా నమోదు అయ్యేలా సంబంధిత వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకొని, అవసరమైన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, నేడు అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతో మంది నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్స్ కు మెరుగైన వైద్య సేవలు అందించి తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించాలన్నారు. జిజిహెచ్ లో పేషెంట్స్ యొక్క ఆన్ లైన నమోదు ప్రక్రియ పట్ల కలెక్టర్ అసంతప్తిని వ్యక్తం చేస్తూ దీనిపై ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్, జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగితే తద్వారా ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి నిధులు పెరిగే అవకాశం వుందని, దాని ద్వారా ఇంకా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవకాశం వుంటుందని కలెక్టర్ తెలిపారు. పోషకాహారం అందక, తక్కువ బరువుతో జన్మిస్తున్న పేద కుటుంబాల పిల్లలను గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి ఏర్పాటుచేస్తున్న 'న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ)'ను ఒక నెల రోజులలోపు జిజిహెచ్ లో అన్నీ వసతులతో ఏర్పాటుచేయాలని కలెక్టర్, వైద్యాదికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, డిసిహెచ్‌ఎస్ డా. రమేష్ నాధ్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. సిద్దా , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డా. చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.










