Oct 16,2023 18:17

మాట్లాడుతున్న ఎంఎల్‌సి

ప్రజాశక్తి - డెస్క్‌ :ఆంగ్ల విద్యాబోధనలో ప్రభుత్వం అనుసరిస్తున్న లక్ష్యాలను అధిగమించేందుకు ఆంగ్ల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వ ఇంగ్లీషు ఉపాధ్యాయుల ఈటా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లీష్‌ సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సూరి శివరాం మూర్తి రాసిన లీటరరీ గిఫ్ట్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంగ్లీష్‌ విద్యకు అధిక ప్రాధాన్యతని స్తుందన్నారు. విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆంగ్ల ఉపాధ్యాయులు టోఫిల్‌ శిక్షణ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు అర్బన్‌ ఎంఇఒ అబ్దుల్‌ హమీద్‌, ఈటా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నిర్వాహకులు కపాల్‌ ఉన్నారు.