Mar 24,2022 23:14

మందులను వితరణ చేస్తున్న కుమారస్వామి రెడ్డి


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు వైయస్సార్‌ సిపి నాయకులు వై.కుమార్‌స్వామిరెడ్డి చేతుల మీదుగా 65 వేల రూపాయలు విలువ గల అత్యవసర విభాగ పరికరాలు, మందులను హాస్పిటల్‌ వైద్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జరీనా బేగం మున్సిపల్‌ చైర్మన్‌ ఏ.హరి, వైస్‌చైర్మన్‌లు డి.శంకర్‌, డి.జయప్రకాష్‌, కౌన్సిలర్‌ భానుమతి, చక్రి, ఎంపీపీ మునివేలమ్మ, అరే అమ్మ ఆలయ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ధర్మరాజు ఆలయ చైర్మన్‌ లారీ మోహన్‌, పుత్తూరు మండలం వైఎస్‌ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.