భూ రికార్డుల ప్యూరిఫికేషన్, సర్వే, రీ సర్వే కార్యక్రమాలను వేగవంతం చేయండి :కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : ప్రైవేటు స్థలాలను ప్రభుత్వ అవసరాల కోసం సేకరించేందుకు దృష్టి పెట్టాలని, భూ వివరాలు సర్వే కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని, సకాలంలో కోర్టు కేసుల పట్ల స్పందించాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) రాజాబాబుతో కలిసి ఆర్‌డి ఓబీలు, తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది స్పందన అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించడం జరిగిందని అందుకు అందరిని అభి నందిస్తూ ఇదే పరిస్థితి కొనసాగాలన్నారు. అనంతరం 22 ఏ కింద ఉన్న కోర్టు కేసులకు ప్రాధాన్యత ఇచ్చి కౌంటర్లు సంబంధిత కోర్టులలో నిర్ణిత సమయంలోపు ధాఖలు చేయాలని లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. భూ సర్వే, రీ సర్వే కార్యక్రమానికి ప్రాదాన్యత ఇస్తూ పి.ఓ.ఎల్.ఆర్ మీద దృష్టి పెట్టాలన్నారు. లే ఔట్‌ల విషయంలో మ్యాపింగ్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలన్నారు. పౌర సరఫరాలకు సంబంధించి తహశీల్దార్లు పరిశీలిస్తుండా లన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ కు సంబందించి పెండింగ్‌లో ఉన్న సమ స్యలను పరిష్కరించాలని, ఎస్.సి., ఎస్.టి కేసులకు సంబందించి సకాలంలో స్పందించి భాదితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గహ నిర్మాణాలకు సంబందించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, అర్హులకు 90 రోజులలో ఇంటి పట్టాల కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. ఆర్.డి.ఓ లు, తాహాసీల్ధార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










