జీడి నెల్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఈశ్వర్‌రెడ్డి
చిత్తూరుఅర్బన్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ డీజి ఆదేశాల మేరకు మంగళవారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ అధికారి ఈశ్వర్‌రెడ్డి పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. తిరుపతి, తొట్టంబేడు, నిండ్ర, గంగాధరనెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను పరిశీలించారు. ఈ తనిఖీలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ వారు ఇవ్వబడిన సూచనల ప్రకారం రోగులకు చికిత్స జరుగుచున్నదా, తగిన వసతులున్నాయా వైద్యులు , నర్సులు అందుబాటులో ఉంటున్నారా, రోగులకు వైద్య పరిక్షలు నిర్వహణ , మందులు తగినంతగా ఉన్నాయా అనే విషయాలపై తనిఖీ నిర్వహించారు.










