ప్రజాశక్తి - భీమవరం రూరల్
శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో భీమవరం పిఎస్‌ఎం బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ ఎడమ చేతి వాటం దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రతిభ పాటవాలు ప్రాపంచిక విషయాలపై పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.సుధారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రతి గురువారమూ ప్రతిభ పోటీలను నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అలవాట్ల విషయంలో మానవునిలో అనేక రకాలు ఉంటారని, ఎడమ చేతి వాటం కూడా ఒక అలవాటు అని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రాపంచిక విషయాలపై అవగాహన కోసం ప్రతి గురువారం పట్టణంలోని అన్ని పాఠశాలలో ఒక్కొక్క అంశంపై పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహాలక్ష్మి పాల్గొన్నారు.










