Jul 01,2023 22:11

ఘనంగా డాక్టర్స్‌ డే వేడుకలు
ప్రజాశక్తి - ఉండి

         వైద్యుల దినోత్సవం వేడుకలను యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయిన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు క్లబ్‌ అధ్యక్షురాలు అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి లయిన్స్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు లయన్‌ కన్నెగంటి రూత్‌ కళ, క్లబ్‌ పరిపాలన అధికారి లయన్‌ రుద్రరాజు నరసరాజు, ఆసుపత్రి ఎంపిహెచ్‌ఒ ఎం.రత్నరాజు మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ శామ్యూల్‌ను శాలువ, పూలమాలతో ఘనంగా క్లబ్‌ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ఉపాధ్యక్షులు, లయన్‌ సత్తి బ్రహ్మరెడ్డి, లయన్‌ గాదిరాజు రంగరాజు, లయన్‌ కాగిత మహంకాళి, లయన్‌ భూపతిరాజు హరినాధ్‌రాజు, లయన్‌ బొండాడ సూర్యబ్రహ్మనందం, లయన్‌ కలిదిండి సీతారామరాజు, లయన్‌ పెన్మెత్స రంగప్రసాద్‌రాజు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
        గణపవరం:మండలంలో పిఎంపి అసోసియేన్‌ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్స్‌ డే సందర్భంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌నాయుడు, కె.కిరణ్మయి, కె.ప్రియాంకదివ్యలకు ఘనంగా సన్మానం నిర్వహించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి దుశ్సాలువలు కప్పి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎంపి అసోసియేషన్‌ కన్వీనర్‌ ఎం.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచ డాక్టర్స్‌ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ కె.పరమేశ్వరరావు, కో కన్వీనర్‌ వి.శివశ్రీనివాస్‌, కొటకల అప్పారావు, జి.శ్రీను, సత్యనారాయణ, ఎం.శ్రీను పాల్గొన్నారు.
లయన్స్‌ క్లబ్‌ ఆధర్యంలో..
      డాక్టర్స్‌ డే సందర్భంగా శనివారం గణపవరం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సంతోష్‌ నాయుడు, రమాకుమారిలను గణపవరం లయన్స్‌ క్లబ్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.నాలుగు వేల విలువైన బ్లడ్‌ ప్రెషర్‌ ఆపరేటర్‌ని అందించారు.
           పాలకొల్లు : విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆదిత్య పవన్‌కుమార్‌ చెప్పారు. వైష్ణవి హైస్కూల్లో జరిగిన డాక్టర్స్‌ డేలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఏకాగ్రతగా చదివితే ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. డాక్టర్‌ లక్ష్మీమౌనిక మాట్లాడుతూ విద్యార్థులు వ్యాయామం చేయాలన్నారు. అనంతరం సత్కార కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ప్రభాకర్‌, హాస్పిటల్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ చినిమిల్లి గణపతి, చెన్ను విజరు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ విజరు కుమారి ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్‌లో వివిధ విభాగాల్లో ఉన్న డాక్టర్స్‌ను ఘనంగా సన్మానించారు. తొలుత డాక్టర్‌ బిసి.రారు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గీతా కుమారి, సునీత, పియుష, నళిని, జయదుర్గా, రేణుకా మాధురి, సౌజన్య, ప్రశాంతి, భవాని, రాంబాబు, కళ్యాణ చక్రవర్తి, భాస్కర్‌, సుధీర్‌, రిచర్డ్‌, డాక్టర్లు, హేడ్‌ సిస్టర్లు పాతిబా, సుజాత పాల్గొన్నారు. ఎవిఆర్‌ మున్సిపల్‌ స్కూలులో విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యపరీక్షలు నిర్వహించారు. బ్రష్‌లు, టూత్‌పేస్టులు, పండ్లు పంపిణీ చేశారు. పాలకొల్లులోని వీర మల్టీ స్పెషాలిటీ డెంటల్‌ క్లినిక్‌ డాక్టర్‌ మల్లుల జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలుఅంశాలపై అవగాహన కల్పించారు.
         తాడేపల్లిగూడెం :స్థానిక చైతన్య హాస్పటల్‌లో తాడేపల్లిగూడెం డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్‌ డే వేడుకల్లో అప్సడా వైస్‌ చైర్మన్‌ లయన్‌ వడ్డి రఘురామ్‌ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్‌ అధ్యక్షులు లయన్‌ కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో లయన్‌ డాక్టర్‌ కె.కమల పర్యవేక్షణలో జిల్లా గవర్నర్‌ లయన్‌ గట్టిం మాణిక్యాలరావు పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా డాక్టర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రఘురామ్‌, జోన్‌ చైర్‌ పర్సన్‌ లయన్‌ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ మైల్‌ సామీ, డాక్టర్‌ కిషోర్‌నాయక్‌, డాక్టర్‌ కామాక్షి, డాక్టర్‌ కమల, డాక్టర్‌ వినరు, డాక్టర్‌ రమాదేవిలను సన్మానించారు.
     పాలకోడేరు : పాలకోడేరు కో-ఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాలలో పాలకోడేరు వాకర్‌ అసోసియేషన్‌, కళాశాల సిబ్బంది విద్యార్థులు ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్‌ పద్మావతి అధ్యక్షతన పాలకోడేరు పిహెచ్‌సి వైద్యులు రంగం నాయుడు, స్వర్ణ నిరంజని, హసీతలను అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాకర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు గుంటూరు రామరాజు, డిఎన్‌ఆర్‌ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కార్యదర్శి కష్ణంరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాకర్‌ సభ్యులు ఐకె.రాజు, నాగరాజు, సీత పాల్గొన్నారు.
          పాలకొల్లు రూరల్‌ : లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్‌ డే నిర్వహించారు. వైద్యులు ఎం.నవ్యజీవన్‌, జి.భవానీప్రసాద్‌లను సిబ్బంది శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌కుమార్‌, ఆరోగ్య విస్తరణ అధికారి కె.ప్రభాకర్‌, పిహెచ్‌ ఎన్‌ ఎలిజబెత్‌, హెల్త్‌ విజిటర్‌, కమల, ఎంఎల్‌ హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.