
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం: ప్రాధాన్యత కేసులపై దృష్టి సారించి, అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులు వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్‌పి పి.ఆర్.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డిఎస్‌పిలతో, సిఐలతో, ఎస్‌లతో సెప్టెంబరు నెలలో నమోదైన కేసులపై, గ్రేవ్ నేరాలు, ఎస్‌సి, ఎస్‌టి, దిశ, పోక్సో, రోడ్డు ప్రమాదాలు, చీటింగ్, సైబర్ నేరాలు, పెండింగ్ కేసుల పురోగతిపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీషీటర్లపై ఉన్న పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తిచేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లపై దృష్టి పెట్టాలని, పోలీసుస్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు భాగస్వాములైన కేసులు ప్రాధాన్యతా క్రమంలో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వేగవంతం చేసి విచారణ చేపట్టి పరిష్కారించాలన్నారు. ప్రతి కేసునీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సాక్ష్యాధా రాలు సేకరణలో సాక్షిలను విచారణలో జాగ్రత్తలు పాటించాలన్నారు. దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ప్రతి కేసునూ సిసిటిఎన్‌ఎస్ వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సంప్రదించి చర్చించాలన్నారు. ప్రతి కేసు విషయం లోనూ విచారణ త్వరితగతిన పూర్తి చేసి దానికి తగిన విధంగా బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. చీటింగ్, సైబర్ కేసులు దర్యాప్తు, వాటి పురోగతిపై సమీక్ష స్తూ ప్రతికేసుపైనా ప్రత్యేక దృష్టిసారించా లన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణకు ముఖ్యమైన కూడళ్లలో బారికేడ్లు, ప్రమాద హెచ్చిరిక సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలపై జరిగిన నేరాలైన ఫోక్సో, ఇతర చట్టాల కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు నివారణ, ఆస్తి నేరాలు ఛేదన, నియంత్రణ, కేసులు దర్యాప్తు వేగవంతం అంశాలపై ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. సమీక్షలో ఆదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావు, డిఎస్‌పిలు వై.శృతి, కె.బాలరాజు, జి.నాగేశ్వ రరరెడ్డి, డి. బాలచంద్రారెడ్డి, జి.వి.ప్రసాద్, వాసుదేవ్, విజయ కుమార్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.మల్లేశ్వరరావు, ఆదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె.శంకరరావు, వై.కృష్ణచంద్, శివకుమార్, ఎపిపిలు నాగభూషణం, సుశీల, ఎఒ గోపీనాథ్, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.