పొట్టి శ్రీరాములు త్యాగం మరువ లేనిది : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కొరకు అమరజీవి పొట్టిశ్రీరాములు సేవలు మరువ లేనిదని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి రబ్బానీబాషా, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, ఎస్‌సి కార్పొరేషన్ ఈడీ నరసింహులు, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
భాషాప్రయుక్త రాష్టం ఏర్పాటు కావడానికి అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన కషిని మరువలేనివని కవి, రచయిత, వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత కట్టమంచి బాలకష్ణారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా గిరింపేట రోడ్డులో ఉన్న పార్కులో గల పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కట్టమంచి బాబి, అమర్నాథ్, ప్రముఖ రచయిత్రి అరుణకుమారి, సహదేవ నాయుడు, శ్రీహరి హరి, ప్రసాద్‌రెడ్డి, శివ, జ్ఞానశేఖర్‌రెడ్డి, ప్రసాదరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పలమనేరు: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం నిర్వహించారు. పట్టణంలోని ఒకటోవార్డులో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. నాయకులు ఆర్‌బిసి కుట్టి, బ్రహ్మయ్య, ఖాజాపీర్, సుబ్రహ్మణ్యం గౌడ్, మదన్, నాగరాజు, సుధాకర్, శ్రీధర్, అములు, వీరప్ప, కోటి, శ్రీనివాసులు, లోకేష్, సుబ్రహ్మణ్యం, సాధిక్ తదితరులు ఉన్నారు.










