Mar 16,2023 22:38

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మేయర్‌ వసీం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌     పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకెళ్దామని నగర మేయర్‌ మొహమ్మద్‌ వసీం పిలుపునిచ్చారు. బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతిని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల మనకు ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. 56 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన మహనీయుడు ఆయన అని కొనియాడారు. వారి త్యాగం రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలని, ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌ : పొట్టి శ్రీరాములు స్పూర్తితో అభివృద్ధి వైపు ముందుకు సాగుదామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమా మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి, ఉప గ్రంథాలయ అధికారిని వి.సుబ్బరత్నమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌, సిబ్బంది కావేరి, బాషా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం సిటీ : అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, ఎ.హనుమంతులు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సేవలు, ప్రాణత్యాగం గురించి కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఆర్‌.డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐ లు రాజశేఖర్‌రెడ్డి, రమేష్‌ నాయక్‌, పురుషోత్తం, జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ : స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌ వద్ద సర్పంచి మీనుగ లలితమ్మ, ఎంపీపీ చందా చంద్రమ్మ, పార్టీ పంచాయతీ రాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, వార్డు సభ్యుడు నిరంజన్‌ గౌడ్‌, ఈఒ గౌస్‌ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కో-ఆప్షన్‌ సభ్యులు పామిడి సలీమ్‌, నాయకులు ఓబన్న, నిర్మలమ్మ, మైనారిటీ నాయకులు పామిడి జాకీర్‌, మద్దికెర అన్వర్‌, తాజుద్దీన్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న ముష్టూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ అశ్రఫ్‌ అలీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు.