ప్రాజెక్ట్ డైరెక్టర్ సుజాత రాణి
ప్రజాశక్తి - ఉండి
చిరుధాన్యాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, ఆ ఆహారం తీసుకోవడం ఆరోగ్యకమని అంగన్‌వాడీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సుజాతరాణి అన్నారు. మంగళవారం మహదేవపట్నంలో పోషన్ పక్వాడ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రాజెక్టు డైరెక్టర్ సుజాతరాణి మాట్లాడుతూ పోషక పదార్థాలతోనే మెరుగైన ఆరోగ్యాన్ని పొందొచ్చన్నారు. విద్యార్థులందరూ పోషక పదార్థాలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ వాణి విజయరత్నం, ఎసిడిపిఒ కృష్ణకుమారి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు రత్నకుమారి, అనిల్‌కుమారి, మేరీ, సుజాత, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
పెనుగొండ : పౌష్టికాహారంతోనే ఆరోగ్యమని ఐసిడిఎస్ అధికారి ఎం.విజయ కుమారి అన్నారు. మంగళవారం సిహెచ్‌సిలో ఐసిడిఎస్ వైద్య అధికారి విజరు కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆకుకూరలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.










