ప్రజాశక్తి - పెనుమంట్ర
ఏప్రిల్ మూడో తేదీ వరకూ జరిగే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐసిడిఎస్ సిడిపిఒ మేరీ ఎలిజిబెత్ అన్నారు. మంగళవారం మొదటి రోజు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సూపర్‌వైజర్లతో ర్యాలీ నిర్వహించి కార్యక్రమం షెడ్యూల్‌ను కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా ఎలిజిబెత్ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి క్రమం తప్పకుండా ప్రతి సెంటర్లలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మొగల్తూరు : పోషకాహారం తీసుకుంటే అంతా ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సిడిపిఒ బి.ఊర్మిళ సూచించారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా గ్రామంలో అంగన్‌వాడీలు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పోషకాహార పక్షోత్సవాలను ఈనెల 20వ తేదీ నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఆర్‌సి ఆనంద్‌కుమార్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
వీరవాసరం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు. ఈ నెల 20న ప్రారంభమైన కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అపరాలు, తృణధాన్యాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రదర్శించి వాటి ఉపయోగాలను పిల్లల తల్లులకు, కిషోర్ బాలికలకు వివరించారు.










