Oct 09,2023 20:47

ఫొటో : మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ రాధమ్మ

పోషకాహారంపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మహిళలకు చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని ఐసిడిఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ రాధమ్మ మహిళలకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో శ్రేయస్కరమన్నారు.
విలువైన పోషకాహారం, మంచి ఆరోగ్యం పరిశుభ్రత, చిరు ధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారణ చర్యలు, స్వచ్ఛత ఇమ్యూనైజేషన్‌ పోషణపై అవగాహన కలిగించారు. పలువురికి పోషకాహార పదార్థాలను అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు నాగమణి శ్రీకళ, ఆదిలక్ష్మి, తిరుపాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.