గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-వెదురుకుప్పం:
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 3న 'ఛలో తిరుపతి' సిపిఎస్ రద్దుకై పోరుగర్జన ర్యాలీకి సంబందించిన గోడపత్రికలను యుటిఎఫ్ వెదురుకుప్పం అధ్యక్షులు దేశయ్య గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మర్దాల శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి పీతాంబరంరెడ్డి, జిల్లా సిపిఎస్ కో-కన్వీనర్ లోకనాథం, మండల మహిళా అధ్యక్షురాలు కల్పన, మండల మహిళా ఉపాధ్యక్షురాలు సుభాషిణి, మండల కోశాధికారి జయచంద్రారెడ్డి, మండల సిపిఎస్ కన్వీనర్ గురునాథం, మండల సిపిఎస్ కో-కన్వీనర్ యుగంధర్ మండల మహిళా సిపిఎస్ కన్వీనర్లు సిద్దిలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.










