
మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ నూరుల్ కమర్
ప్రజాశక్తి - టెక్కలి: మూలపేట అదానీ పోర్టుకు మండలంలోని బన్నువాడ, మోదుగువలస మీదుగా నిర్మాణం చేపట్టనున్న రోడ్డు స్థలాన్ని టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ బుధవారం పరిశీలించారు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఎంతమంది రోడ్డు నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేస్తూ భూములు ఇచ్చారు?, ఇంకా ఎంతమంది భూములు ఇవ్వలేదనే వివరాలతో కూడిన జాబితాను వేర్వేరుగా తయారు చేసి అందించాలని తహశీల్దార్ ప్రవళ్లికాప్రియను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామారావు, విఆర్‌ఒ దుక్క జోగారావు, సుకన్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.