
రైల్వే లైన్లు వేయబోయే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న జెసి నవీన్
ప్రజాశక్తి - నౌపడ: మూలపేట పోర్టు నిర్మాణంలో ముఖ్యమైన రైల్వే లైన్‌కు విడుదలైన నోటిఫికేషన్‌లోని భూములను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ బుధవారం పరిశీలించారు. కూర్మనాథపురం, కోటపాడు పరిధిలోని రైల్వే లైన్‌కు అవసరమైన భూముల వివరాలను అధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు. ప్రధాన రైల్వే లైన్ నుంచి పోర్టుకు అనుసంధానించే రైలు మార్గం కలిపే జంక్షన్‌ను పరిశీలించారు. రెవెన్యూ సర్వే అధికారులు మ్యాపు ద్వారా సేకరించే భూముల వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం నౌపడలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఎర్త్ ఫిల్లింగ్ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని పోర్టు అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సంతబొమ్మాళి తహశీల్దార్ చలమయ్య, పలువురు సచివాలయ అధికారులు పాల్గొన్నారు.