Mar 19,2023 22:22

మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఐద్వానాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       సమాజంలో బానిసత్వం, వివక్ష, ధౌర్జన్యం, దోపిడీ వ్యవస్థ రూపుమాపేందుకు, సమానత్వం కోసం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమం గణేనాయక్‌ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, జెవివి నాయకురాలు డాక్టర్‌ ప్రసూన, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, విజ్ఞాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్ర కన్వీనర్‌ ఎజి.రాజమోహన్‌, ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రదాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి తదితరులు హాజరై మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం చూపిన పోరాట స్ఫూర్తి, ధైర్య సహసాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. మహిళ అయినా ఎన్నో నిర్బందాలు, అరెస్టులు, ఎదుర్కొని మహిళలను పోరాటంలోకి తీసుకొచ్చేందుకు చైతన్యం కల్పించారని తెలిపారు. తుది శ్యాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన నిబద్ధత, నిజాయతీ, నీతి నియమాలు అనుసరించిన గొప్ప నాయకురాలు స్వరాజ్యం అన్నారు. ఆమె ఆశయాలు సాధించడం కోసం కృషి చేయడమే మనం ఇచ్చే నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, నగర కార్యదర్శి చంద్రిక, సంయుక్త కార్యదర్శి రామాదేవి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం నగర 1వ కమిటీ ఆధ్వర్యంలో
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి అన్నారు. ఆదివారం రాజీవ్‌ కాలనీలో పేదలు గుడిసెలు వేసుకున్న సిపిఎం కాలనీలో మల్లు స్వరాజ్యం వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, ప్రకాష్‌, మసూద్‌, బాబు, నాగభూషణం, మోహన్‌, శివ, షరీఫ్‌, ఐద్వా నాయకులు లతా, ఆదిలక్ష్మి, లాలమ్మ, సునీత, వెంకటలక్ష్మి, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.