ప్రజాశక్తి - భీమవరం
పోలవరం నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం చేపట్టిన పోలవరం పోరుకేకకు సంఘీభావం తెలపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ కోరారు. నిర్వాసితులకు, రైతులకు పోరుకేక పాదయాత్రకు అండగా విరాళాలు అందించి, సహాయం చేసి, ఆదుకుందామని పిలుపునిచ్చారు. భీమవరంలో పోరుకేక పాదయాత్ర సహాయనిధి సేకరణ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆంజనేయులు, వైకుంఠరావు, వెంకటేశ్వరరావు, విద్యార్థి సంఘం నాయకులు పెద్దిరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.
గణపవరం :సిపిఎం గణపవరం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మల్లపరాజుపేటలో పోలవరం పోరుకేక మహాపాదయాత్రకు సంఘీభావ నిధి క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం పూర్తిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, నరాలశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి పెంటారావు పాల్గొన్నారు.
వీరవాసరం : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుకేక మహా పాదయత్రకు సంఘీబావంంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణకు విశేషమైన మద్దతు లభిస్తుంది. వీరవాసరం, నవుడూరు గ్రామాల నుంచి రూ.7787 సమకూరినట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ పోతుల మృత్యంజయ తెలిపారు. ఈ విరాళాల సేకరణలో సీనియర్ నేత జుత్తిగ నరసింహమూర్తి, కేతా జ్యోతిబసు, పాలాకోటేశ్వరరావు, యాళ్లబండి నారాయణమూర్తి, అయినంపూడి బాబురావు, రెడ్డి రామారావు, బి.సూర్యచంద్ర, శ్యాంబాబులు పాల్గొన్నారు.










