పోలింగ్ బూత్‌లు మార్చండి..
కలెక్టర్‌కి టిడిపి నాయకుల వినతి
ప్రజాశక్తి -వెదురుకుప్పం: వెదురుకుప్పం మండలంలో సంతబయలు, గొడుగుచింత, ఇనాంకోత్తూరు పంచా యతీల్లో ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని శుక్రవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిడిపి నాయకులు ఆయన దష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయంలో అఖిల పక్షం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి, జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి పి.మోహన్ మురళి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వినతి పత్రం సమర్పించి సమస్యను వివరిం చారు. కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మోహన్ మురళి తెలిపారు. ఈ కార్యక్ర మంలో వెదురుకుప్పం డిప్యూటీ తహశీల్దార్, నియోజకవర్గ టిడిపి నాయకులు చిట్టిబాబు నాయుడు, రుద్రయ్య నాయుడు గుండయ్య, రమేష్, గురప్పనాయుడు పా ల్గొన్నారు.










