Jul 22,2023 22:00

పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతున్న కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర బృందం సభ్యుడు బాలచంద్ర

        ప్రజాశక్తి-బెలుగుప్ప   పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలని కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర బృందం సభ్యుడు బాలచంద్ర సూచించారు. శనివారం మండల కేంద్రంలోని బెలుగుప్ప పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉత్తమ పోలీస్‌స్టేషన్ల గుర్తింపు, జాతీయస్థాయి ర్యాంకింగ్‌ ప్రకటన కోసం తాము పర్యటిస్టున్నట్లు తెలిపారు. అనంతరం అనంతరం పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ సీఐ శేఖర్‌, ఎస్‌ఐ రామకృష్ణయ్య, ఎఎస్‌ఐలు రామదాసు, దేవదాసు, జమేదారులు బాలనరసింహులు, మల్లికార్జున, పోలీసులు ఖాసీంబాషా, నాగరాజు, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.