Jul 21,2023 21:13

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

      అనంతపురం : పోలీసులకు దేహదారుఢ్యం చాలా ముఖ్యమని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. నంతపురం జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో శుక్రవారం నాడు అనంతపురం, అనంతపురం రూరల్‌ సబ్‌ డివిజనన్ల సిబ్బంది, ఏఆర్‌ సాయుధ బలగాలు, స్పెషల్‌ పార్టీ, హోంగార్డుల పరేడ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిజికల్‌ ఫిట్నెస్‌ కలిగి ఉండాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉండాలన్నారు. ఆరోగ్యం మెరుగదల, ఫిజికల్‌ ఫిట్నెస్‌ కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. ఆరోగ్యంతో పాటు మానసికంగా దఢంగా ఉంటేనే విధుల్లో సమర్థవంతంగా పని చేయవచ్చుని సూచించారు. ఆతర్వాత ఎఆర్‌, స్పెషల్‌ పార్టీ, హోంగార్డులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి విధులు, సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.