Mar 25,2022 15:18

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేర్ లో పదవ తరగతి మైనారిటీ విద్యార్థిని మిస్బాన్ ఆత్మహత్య కారణమైన రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 24 గంటల్లో రమేష్ ను అరెస్టు చేయకపోతే యూనిఫామ్ తీసేసి కూలి పని చేసుకుంటా అని సిఐ భాస్కర్ సవాల్ చేసిన సంగతి విదితమే. తమిళనాడులో రామేశ్వరం దగ్గర రమేష్ ను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.