Mar 18,2023 21:50

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
               పోలీసు కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్‌పి రవిప్రకాష్‌ అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ అనారోగ్యంతో సిబ్బంది మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఇటీవల పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎస్‌పి శనివారం ఆయన కార్యాలయంలో ఆర్థిక సాయం అందించారు. ఇటీవల నరసాపురం ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వైవి.నాగేశ్వరరావు కుటుంబానికి రూ.లక్ష చెక్కును భార్య విజయలక్ష్మికి, హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్‌.శ్రీనివాసరావు కుటుం బానికి రూ.లక్ష చెక్కును భార్య కనకదుర్గకు అందించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర అన్ని బెనిఫిట్స్‌లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ ఎవి.సుబ్బరాజు పాల్గొన్నారు.