May 18,2023 21:18

ప్రజాశక్తి - ఉండి
ఉండి పోలీస్‌ స్టేషన్‌ను భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లనూ పరిశీలిస్తామని, దీనిలో భాగంగానే ఉండి పోలీస్‌ స్టేషన్‌కు రావడం జరిగిందని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. సిబ్బంది కొరతను ఎప్పుడు పూర్తి చేస్తారని అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఉండిలోనే కాకుండా తమ ప్రాంతంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉందని, త్వరలో పరిష్కరించి దిశగా కృషి చేస్తానని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కె.గంగాధర్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు.