పోక్సో కేసులో
ముద్దాయికి జీవిత ఖైదు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
పోక్సో కేసులో ముద్దాయి బాలాజీకి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. గంగవరం మండలం మారేడుపల్లి గ్రామ నివాసి ఎస్.మురళి కుమారుడు ఎస్.బాలాజీ (20) 2014లో అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గంగవరం సిఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రిమాండ్‌కు పంపారు. స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం జీవితఖైదు, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పలమనేరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్‌ను, గంగవరం ఎస్‌ఐ పివి సుధాకర్‌రెడ్డి, ఎఎస్‌ఐ కె.మనోహర్‌లను డిఎస్‌పి ఎన్.సుధాకర్‌రెడ్డి అభినందించారు.










