Oct 11,2023 20:06

మాట్లాడుతున్న పోగాకు బోర్డు అధికారులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు - 1 వేలం కేంద్రంay ప్రత్యామ్నాయ పంటల పై పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ ఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం లక్ష్మణరావు మాట్లాడుతూ పొగాకు రేట్లు వివిధ దేశాల్లో దిగుబడి, నాణ్యత వంటి అనేక అంతర్జతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయన్నారు. పొగాకు ధరలు సుస్థిరమైన. ఆదాయ వనరురిగణించ వద్దని తెలిపారు. పొగాకు బోర్డు అనుమతించిన విస్తీర్ణం ఒక బ్యారన్‌ కు 2.9 హెక్టార్లు అని, అనుమతించిన పంట 3650 కేజి లు మాత్రమే పండించాలని తెలిపారు. పొగాకు ధరలలో అస్థిరత్వం ఉన్నందున , పొగాకు పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దష్టి సారించాలని సూచించారు కెవికె దర్శి సైంటిస్ట్‌ ఆదిలక్ష్మి మాట్లాడుతూ పొగాకు కు ప్రత్యామ్నాయం గా చిరు ధాన్యాలు అయిన రాగి,జొన్న అలాగే మినుము, శనగ వంటి పంటలు వేసుకోవాలని తెలిపారు. హార్టికల్చర్‌ ప్రొఫెసర్‌ శారద మాట్లాడారు. మండల వ్యవసాయ అధికారి వి రాము గారు, వేలం నిర్వహణ అధికారులు చైన్‌ రామ్‌ మీనా గారు, రాజగోపాల్‌ , పొగాకు బోర్డు సిబ్బంది ఉన్నారు.