ప్రజాశక్తి - కాళ్ల
ప్రకృతిలో అన్ని జీవ రాశులూ ముఖ్యమైనవే. కొన్ని జీవరాశులు మనకు మేలు చేస్తాయి. కొన్ని కీడు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడం కోసం మేలు చేసే వాటిని సంరక్షించుకోవాలి. కొన్ని పక్షులు కాలాన్ని బట్టి పయనిస్తూ ఉంటాయి. వరి చేల్లో ట్రాక్టర్‌తో దుక్కు దున్నినప్పుడు ఎక్కువ సంఖ్యలో కొంగలు వాలుతుంటాయి. పొలంలోని హానికర పురుగులను ఏరుకుని తింటూ రైతులకు మేలు చేస్తాయి. గురువారం కురిసిన వర్షాలకు సీసలి, కాళ్ల, జక్కరం, కోపల్లె గ్రామాల్లో పొలాల్లో దమ్ములు చేసే పనుల్లో రైతులు నిమగమయ్యారు. ఆ సయయంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కొంగలు రావడంతో చూపరులను కనువిందు చేశాయి.










