Oct 03,2023 20:50

పొగనారు మళ్లును పరిశీలిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :సిటిఆర్‌ఐ సూచనల మేరకు పోగాకు సాగులో మెళకువలు పాటించాలని పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎం.లక్ష్మణ రావు రైతులకు సూచించారు. మంగళవారం ఆయన వలేటివారిపాలెం మండలంలోని బంగారక్క పాలెం పొగాకు రైతులకు నారుమళ్లు, పొగకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యజమాన్య పద్ధతులు పై శిక్షణ ,పంట నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ ఎం లక్ష్మణరావు , ఐటిసి ప్రతినిధి ప్రవీణ్‌ బాబు, జి పి ఐ రవి కుమార్‌ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ నాణ్యమైన న్షారును తగిన సమయం లో నాటలన్నారు .సమగ్ర సస్య రక్షణ చర్యలు ,ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడుతో పాటు నాణ్యమైన పొగాకును ఉత్పతి చేయవచ్చన్నారు. రాజ్‌గోపాల్‌ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు ,పురుగు మందులు వాడకంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.