Oct 05,2023 20:37

నారుమళ్లును పరిశీలిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు సిటిఆర్‌ఐ సూచనల మేరకు పోగాకు సాగులో మెళకువలు పాటించాలని పొగాకు బోర్డు వేలం నిర్వహణ అధికారి చైన్‌ రామ్‌ మీనా రైతులకు సూచించారు. గురువారం ఆయన పొన్నలూరు పొగాకు రైతులకు పొగాకు నారుమళ్లు, పొగకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యజమాన్య పద్ధతులపై శిక్షణ ,పంట నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఐటిసి ప్రతినిధి ప్రవీణ్‌ బాబు, పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి రామంజనేయులు , జి పి ఐ ప్రతినిధి రవి కుమార్‌ పాల్గొని రైతులకు సూచనలు చేశారు. వేలం నిర్వహణ అధికారి మాట్లాడుతు నాన్యమైన న్షారును తగిన సమయం లో నాటలన్నారు. ఐటిసి మేనేజర్‌ ప్రవీణ్‌ బాబు, కంపనీ మేనేజర్‌ రామాంజనేయులు మాట్లాడారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ జి ఉపేంద్ర, రైతులు పాల్గొన్నారు.