ప్రజాశక్తి -పొదలకూరు :పొదలకూరులో త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో శనివారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జెడ్‌పి ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో రూ. 20 లక్షలతో కళాశాలకు ప్రహరీ కట్టించినట్లు తెలిపారు. కళాశాల ఆవరణంలో వాకింగ్ ట్రాక్ కావాలని కోరుతున్నారన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శనివారం పొదలకూరు పట్టణంలో పర్యటించి వివిధ అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. తొలుత ఆయన పట్టణంలోని రామనగర్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆయన తండ్రి, సీనియర్ రాజకీయ నేత,స్వర్గీయ కాకాణి రమణారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో దంత వైద్యానికి సంబంధించిన పరికరాలను ప్రారంభించారు. పట్టణంలోని ఏసీ కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం జరిపారు. పొదలకూరు జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసుల రెడ్డి, మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి. రమణారెడ్డి, కోనం చిన్న బ్రహ్మయ్య, వేణు%శీ%బాక చంద్రశేఖర్ రెడ్డి, సోమా అరుణ ,బి. సురేష్ కుమార్ రెడ్డి, మద్దిరెడ్డి రమణారెడ్డి, సోమా భాస్కర్, ఎం. శేఖర్, వేణుగోపాల్ రెడ్డి, పొదలకూరు తాసిల్దార్ వీర వసంత్ కుమార్, ఎంపీడీవో నగేష్ కుమారి ఉన్నారు.










