Jun 03,2022 07:43

ప్రజాశక్తి-వెదురు కుప్పం ( చిత్తూరు జిల్లా) :  ఇది జక్కిదొన సచివాలయం పరిస్థితి. ఇరుకైన భవనంలో వసతులు లేక అవస్థలు. ఇదేమో ఎంపీపీ నాగరాణి సొంత సెగ్మెంట్ సామి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పనులు మంజూరు చేయిస్తే ఆ పనులు పూర్తి చేసి వుంటే ఒట్టు. గ్రామ సచివాలయం, ఆర్భీకే భవన నిర్మాణాలు నత్తలతో పోటీ పడుతూనే ఉన్నాయి. మిగతా వెల్ నెస్ సెంటర్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, పాలకేంద్రం భవన నిర్మాణం పనులకు పునాది రాయీ పడలేదు. ఇంకెన్నాళ్లకు పడుతుందో గోరంతలను కొండంతలుగా చెప్పే వాళ్లకే ఎరుక. ఇదేనా అభివృద్ధి అంటే పనులు చేయించలేకపోవడమంటే అసమర్థతకు నిదర్శనమా?